సర్వకార్యసిద్ధి హనుమాన్‌ మంత్రం
#1
త్వమస్మిన్‌ కార్య నిర్యోగే
ప్రమాణం హరిసత్తమ!
హనుమన్‌ యత్న మాస్థాయ
దు:ఖ క్షయ కరోభవ!!

సుందరకాండలోని 39వ సర్గలో అయిదవ శ్లోకంగా ఉన్న ఈ మాటను సీతమ్మ సాక్షాత్‌ ఆంజనేయస్వామితో పలికింది.

ఈ మంత్రాన్ని మంగళవారం లేదా శనివారం రోజు పఠించడం ప్రారంభిస్తే విశేష ఫలితమని చెబుతారు.

ముఖ్యంగా శనివారం రోజు సంధ్యా సమయంలో స్నానమాచరించి శుచిగా హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఈ కార్యసిద్ధి మంత్రాన్ని పఠించాలి.

ఈ మంత్రాన్ని 40 రోజులపాటు ప్రతి రోజూ భక్తితో 1110సార్లు పఠించాలి.
Reply


Forum Jump: