భద్రాచల రాముడికి పేటెంట్
#1
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పేరుతో ఎలాంటి అనుమతి లేకుండా కల్యాణాలు, హోమాలు, జపాలు చేయడం సరైన పద్ధతి కాదని, ఎలాంటివారైనా ఇక్కడి దేవుడి పేరు, వెబ్‌సైట్‌ చిరునామా, ధ్రువమూర్తుల చిత్రాలను ఉపయోగించడం నేరమని రామాలయ ఈఓ రమాదేవి పేర్కొన్నారు.

ఖగోళయాత్రతో ఎలాంటి సంబంధం లేదు - విలేకరుల సమావేశంలో ఈఓ రమాదేవి

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పేరుతో ఎలాంటి అనుమతి లేకుండా కల్యాణాలు, హోమాలు, జపాలు చేయడం సరైన పద్ధతి కాదని, ఎలాంటివారైనా ఇక్కడి దేవుడి పేరు, వెబ్‌సైట్‌ చిరునామా, ధ్రువమూర్తుల చిత్రాలను ఉపయోగించడం నేరమని రామాలయ ఈఓ రమాదేవి పేర్కొన్నారు. భద్రాచల రాముడి పేరిట పేటెంట్‌ హక్కు తీసుకునేందుకు దేవాదాయ శాఖ ద్వారా దరఖాస్తు చేస్తామని వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘శ్రీరామ టెంపుల్‌ ఆఫ్‌ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో రామాలయాన్ని నిర్మిస్తున్న నిర్వాహకులు ‘ఖగోళ యాత్ర’ నిర్వహించారు. వారు ఈ నెల 17న భద్రాచలంలో ఓ ప్రైవేటు సత్రంలో నిర్వహిస్తున్న శాంతి కల్యాణం ఆహ్వాన పత్రికను చూసి నివ్వెరపోయాం. భద్రాద్రి రామాలయం తరఫున ఖగోళయాత్ర చేస్తున్నట్లు అందులో ఉంది. దీని ద్వారా భక్తుల నుంచి విరాళాలను సేకరించారు. ఇది దైవద్రోహం. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు సమాచారం అందజేశాం. నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

అర్చకులపై నివేదిక: వ్యక్తిగత సెలవులు తీసుకున్న భద్రాచల రామాలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు, అర్చకుడు సీతారాం ఖగోళ యాత్రలో పాల్గొన్నారని, ఆలయం పేరిట కల్యాణాలు చేస్తున్న సంగతిని వీరు దేవాదాయ శాఖ దృష్టికి తీసుకురాలేదని దీనిపై కమిషనర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఈవో వెల్లడించారు.
Reply


Messages In This Thread
భద్రాచల రాముడికి పేటెంట్ - by Srinivas - 16-09-2024, 08:36 AM

Forum Jump: