యజ్ఞం,క్రతువు,యాగం సత్రం,మఖం
#1
యజ్ఞం అంటే దేవతకు సమర్పణంగా చేసే ఆరాధన. వివిధ ఆహుతులను దేవతా ర్పణంగా చేసే క్రియ.

ఇలా ఆహుతులు సమర్పించే క్రియనే 'యాగం' అంటారు. 'మఖం ' కూడా దీనికి పర్యాయమే.

యూపస్తంభం ఉంచి చేసే యజ్ఞాన్ని 'క్రతువు ' అంటారు.

'సత్రం' అంటే 12 రాత్రులకు పైగా జరిగే యజ్ఞం. ఇందులో అందరూ అందరూ యజమానులే అందరూ ఋత్విజులే.

యజ్ఞం చేసే వాడు యజమాని. యజ్ఞంలో యజమాని దంపతులకే ఫలం. మిగిలిన ఋత్విజాదులకి దక్షిణతోనే చెల్లు. కానీ 'సత్రం' లో అందరూ యజమానులే. అందరికీ ఫలం ఉంటుంది.
Reply


Messages In This Thread
యజ్ఞం,క్రతువు,యాగం సత్రం,మఖం - by Srinivas - 29-01-2024, 03:53 AM

Forum Jump: