Bhadrachala Rama
భద్రాద్రి రాముడి పేరుతో విరాళాలు తగవు: ఆలయ ఈవో హెచ్చరిక - Printable Version

+- Bhadrachala Rama (https://bhadrachalarama.org/forum)
+-- Forum: Bhadrachala Rama (https://bhadrachalarama.org/forum/forumdisplay.php?fid=1)
+--- Forum: Temple & Darshan దేవాలయం & దర్శనం (https://bhadrachalarama.org/forum/forumdisplay.php?fid=4)
+--- Thread: భద్రాద్రి రాముడి పేరుతో విరాళాలు తగవు: ఆలయ ఈవో హెచ్చరిక (/showthread.php?tid=18)



భద్రాద్రి రాముడి పేరుతో విరాళాలు తగవు: ఆలయ ఈవో హెచ్చరిక - Srinivas - 15-09-2024

భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి భద్రాద్రి, శ్రీరామ టెంపుల్‌ ఆఫ్‌ యూఎస్‌ఏ నిర్వాహకులను హెచ్చరించారు.

భద్రాచలం పట్టణం : భద్రాద్రి, శ్రీరామ టెంపుల్‌ ఆఫ్‌ యూఎస్‌ఏ పేరుతో అమెరికాలోని అట్లాంటా నగరంలో భద్రాద్రి ఆలయం నమూనాతో మరో దేవాలయాన్ని నిర్మించి విరాళాలు సేకరిస్తున్న నిర్వాహకులను భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఈవో ఎల్‌రమాదేవి హెచ్చరించారు.

ఖగోళ యాత్ర అనే పేరుతో కొన్ని పట్టణాల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న యూఎస్‌ఏ నిర్వాహకులు ఈ రోజు భద్రాచలం చేరుకున్నారు. భద్రాద్రి శ్రీ రామ టెంపుల్ ఆఫ్  యూఎస్ఏ పేరుతో భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ  విషయం తెలుసుకున్న భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి వారిని నిలదీశారు. భద్రాద్రి పేరుతో విరాళాలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు.

ఈ విషయంపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. భద్రాద్రి శ్రీరామ టెంపుల్‌ ఆఫ్‌ యూఏస్‌ఏ పేరుతో విరాళాలు సేకరించే విషయంపై ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ఎవరైనా భద్రాద్రి ఆలయం పేరును వాడుకోవడం కానీ, ఆలయంలోని మూలవిరాట్‌ల చిత్రాలను ప్రదర్శించి విరాళాలు సేకరిస్తే న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.